సోలోబ్ర‌తుకే సో బెట‌ర్ మూవీలో క్లాస్ ప‌ర్పార్మెన్స్‌తో ఆక‌ట్టుకుంది.

టాలీవుడ్ ముద్దుగుమ్మ ఇస్మార్ట్ శంక‌ర్ హీరోయిన్ న‌భాన‌టేష్ జోరు మీదుంది. ఇస్మార్ట్ శంక‌ర్ లో చాందినీ అనే మాస్ రోల్ లో అద‌ర‌గొట్టిన న‌భా ప్ర‌స్తుతం సోలో బ్ర‌తుకేసో బెట‌ర్ సినిమాలో క్లాస్ ప‌ర్పార్మెన్స్‌తో ఆక‌ట్టుకుంది. రీసెంట్ రిలీజైన ఈ చిత్రానికి మంచి స‌క్సెస్ పుల్ గా ర‌న్ అవుతోంది. క‌రోనా బ్రేక్ త‌రువాత ఫ‌స్ట్ మూవీగా రిలీజైన ఈ సినిమాకి మొద‌టి రెండు రోజుల్లో క‌లెక్ష‌న్ లు బాగా వ‌స్తున్నాయి. సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ లో న‌భాన‌టేష్ త‌న మార్క‌ను చాటుకుంది. క‌థ అస‌లైన మ‌లుపు తీసుకున్న స‌మ‌యంలో ఎంట్రీ ఇచ్చి సెంక‌డాఫ్ మొత్తం త‌న‌దైన క్యూట్ ప‌ర్పార్మెన్స్ తో ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా హీరోసాయిధ‌ర‌మ్ తేజ్ తో త‌న కెమిస్ట్రీ బాగా పండించింది. అమృత అనే రోల్ లో చలాకీ క‌నిపించి ఎంట‌ర్ టైన్ చేసింది. అంతే కాకుండా ఈ మూవీలో న‌భా చాలా అందంగా క‌నిపించింది అంటున్నారు. ప్రేక్ష‌కులు. ఈ మూవీకి న‌భా మంచి ప్ల‌స్ అయింద‌ని క్రిటిక్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. చాందినీ లాంటి మాస్ రోల్‌లో అయినా, అమృత లాంటి క్లాస్ రోల్ లో అయినా న‌భా ఈ జీగా ఒదిగిపోగ‌ల‌న‌ని నిరూపించింది. న‌భా. ప్ర‌స్తుతంఈ సినిమా స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న న‌భా బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో అల్లుడు అదుర్స్,నితిన్‌తో అంధాదూన్ తెలుగు రీమేక్ చేస్తుంది.‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *