రామ్‌చ‌ర‌ణ్, ర‌ష్మిక కాంబినేష‌న్ లో కొత్త మూవీ…

టాలీవుడ్ యంగ్ హీరో రామ్‌చ‌ర‌ణ్, శంక‌ర్ కాంబినేష‌న్‌లో తాజాగా మ‌న ద‌క్షిణాది నుంచి అనౌన్స్ కాబ‌డ్డ సెన్సేష‌న్ ప్రాజెక్ట్ ఏద‌న్నా ఉంది అంటే అది శంక‌ర్ మ‌రియు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ల‌దే అని చెప్పాలి. వీరి క‌ల‌యిక‌లో నుంచి మూవీ అనౌన్మ్సెంట్ రాగానే అంచ‌నాలు మ‌రో స్థాయికి వెళ్లాయి.ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా ఉంటుంద‌ని ,మూవీలో ఎలాంటి విజువ‌ల్స్ ఎఫెక్ట్స్ కానీ… స్పెష‌న‌ల్ సీన్స్ కానీ ఏమి ఉండ‌వ‌ని, రాజ‌కీయ నేప‌థ్యంలో మూవీన్ని తెర‌కెక్కించ‌నున్నార‌ని ఇలా ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వారు గుస‌గుస‌లు పుట్టిస్తున్నారు. కొత్త‌గా వీరిఇద్ద‌రి మూవీకి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. వ‌రుస హిట్స్ తో దూసుకెళుతున్న ర‌ష్మికమండాన్న ఈ మూవీలో క‌థానాయిక‌గా ఎంపికైంద‌ని అంటున్నారు. ర‌ష్మికకు తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల‌లోనూ మంచి క్రేజ్ ఉన్న నేప‌థ్యంలో ఆమెను ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. ర‌ష్మిక న‌టించిన క‌న్న‌డ మూవీ పొగ‌రు రేపు విడుద‌ల‌కానున్న సంగ‌తి తెలిసిందే. కాగా ర‌ష్మిక‌.. పుష్ప మూవీతో పాటు త‌మిళం, హిందీలో మూవీల‌తో బిజీగా ఉంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *