సారంగ‌ద‌రియా పాట అద్భుత‌మైన విజ‌యం…

టాలీవుడ్ యంగ్ నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా వ‌స్తున్న మూవీ ల‌వ్‌స్టోరి విష‌యం తెలిసిందే. ఈమూవీలో సారంగ‌ద‌రియా పాట అద్భుతంగా ప్రేక్ష‌కుల మ‌నస్సును కొల్ల‌గొట్టింది. అయితే ఇంత అప్వూర స్పంద‌న ల‌భిస్తుంద‌ని అనుకోలేదు. లిరిక‌ల్ వీడియో వంద మిలియ‌న్ల వ్యూస్ సాధించ‌డం
సంతోషంగా ఉందన్నారు. ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల .ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న మూవీ ల‌వ్‌స్టోరి.నారాయ‌న్‌దాస్ కె నారంగ్‌,పి. రామ్మోహ‌న్‌రావు నిర్మిస్తున్నారు. ఈనెల 16న విడుద‌ల‌కానుంది. ఈమూవీలోని సారంగ‌ద‌రియా పాట యూట్యూబ్‌లో 32 రోజుల్లోనే వంద మిలియ‌న్ల వ్యూస్‌ను సాధించింది. ఈ నేప‌థ్యంలో శేఖ‌ర్ క‌మ్ముల మాట్లాడుతూ మూడు సంవ‌త్స‌రాల క్రిత‌మే సారంగ‌ద‌రియా పాట విన్నా . అవ‌కాశం వ‌చ్చినప్పుడు మూవీలో ఉప‌యోగించాల‌నుకున్నా. నేప‌థ్యంలో ,సీన్ కుద‌ర‌డంతో ల‌వ్‌స్టోరిలో ఈ పాట‌ను తీసుకున్నాం. జాన‌ప‌ద గీతానికి త‌న‌దైన ముద్ర‌తో సుద్దాల అశోక్‌తేజ కండ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా సాహిత్యాన్ని అందించారు. తాజా ప‌ద‌ప్ర‌యోగాలు చేశారు. ఫోక్ శైలిని అర్థం చేసుకుంటూ ప‌వ‌న్ చ‌క్క‌టి బాణీల‌ను స‌మ‌కూర్చారు. మంగ్లీ పాడిన విధానం, శేఖ‌ర్ మాస్ట‌ర్ నృత్యాలు చ‌క్క‌గా కుదిరాయి. ఈ లిరిక‌ల్ గీతానికి మంచి ప‌దింత‌ల ఆద‌ర‌ణ వీడియో సాంగ్‌కు వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాం. మూవీ అంద‌రి అంచ‌నాల‌ను అందుకుంటుంది.అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *