మ‌హేష్ బాబు కొత్త సినిమా మొద‌లైంది…

మ‌హేష్‌బాబు హీరోగా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రానున్న సినిమా స‌ర్కారు వారి పాట కాగా ఈమూవీ ఈ రోజు లాంఛ‌నంగా స్టార్ట్ అయింది. కెపిహెచ్‌.బీ కాల‌నీలోని కాశీ విశ్వ‌నాథ స్వామి టెంపుల్లో 11:43 కి పూజా కార్య‌క్ర‌మాల‌తో మ‌హేష్ బాబు కూతురు ఘ‌ట్ట‌మ‌నేని సీతార క్లాస్ కొట్టగా , న‌మ్ర‌త మ‌హేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. జ‌న‌వ‌రి మొద‌టివారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకానుంది. మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కాగా భార‌త బ్యాంకింగ్ రంగాన్ని క‌దిలించిన భారీ కుంభ‌కోణాల చుట్టూ ఈ సినిమా క‌థ కేంద్రీకృత‌మైంద‌ని.. మ‌హేష్ ఒక బ్యాంక్ మేనేజ‌ర్ కొడుకు పాత్ర‌ను పోషిస్తున్నాడ‌ని..వేలాది కోట్ల ఎగ‌వేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆడ‌బ్బు మొత్తాన్ని తిరిగి రాబ‌ట్ట‌డానికి మ‌హేష్ ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేశాడు. ఈ కార్య‌క్ర‌మంలో మ‌హేష్ వేసే ప్లాన్స్ ఏమిటి అనే అంశాల చుట్టూ సినిమా న‌డుస్తోంద‌ని తెలుస్తోంది. అంటే మ‌హేష్ వేసే ప్లాన్స్ చుట్టూ వ‌చ్చే సీన్స్‌పుల్ ఎంట‌ర్ టైన్ గా ఉంటాయ‌ట‌. అలాగే నేటి రాజ‌కీయ నేప‌థ్యం కూడా ఎంచుకున్నార‌ని.. సినిమాలో రాజ‌కీయాల‌ను ప్ర‌స్తావించ‌బోతున్నార‌ని సినీ స‌ర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. అదే విధంగా ఈ చిత్రంలో ఆహ్లాద‌క‌ర‌మైన ఓ రొమాన్స్ ట్రాక్ కూడా ఉంద‌ని, చాలా కాలం త‌రువాత మ‌హేష్ ల‌వ‌ర్ బాయ్‌గా న‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, జీఎమ్‌బి ఎంట‌ర్టైన్మెంట్ ,14రీల్స్ ప్ల‌స్ సంస్థ‌లు ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ప్రెస్టీజియ‌స్ మూవీ ను నిర్మిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *