చై-సామ్ గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు….

టాలీవుడు మ‌న్మ‌థుని కోడ‌లు అక్కినేని స‌మంత పెళ్త్ళెన త‌రువాత కూడా గ్లామ‌ర్ షో విష‌యంలో ఏమాత్రం కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. ఆ మ‌ధ్య మ‌ల్దీవుల‌కి వెళ్లి బికినీ లో దిగిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన స‌మంత ప్ర‌స్తుతం గోవాలో చేస్తున్న ర‌చ్చ‌కు సంబంధించిన ఫొటోల‌ను త‌న ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేస్తుంది. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల కోసం ప్ర‌తి ఏడాది గోవాకు వెళ్లే చై-సామ్ దంప‌తులు ఈసారి క‌రోనా ఉన్నా కూడా అక్క‌డ‌కు వెళ్లారు. ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని ఎంజాయ్ చేస్తూ చిలౌట్ అవుతున్నారు. స‌మంత త‌న భ‌ర్త‌తో పాటుబెస్ట్ ఫ్రెండ్‌, డిజైన‌ర్ శిల్పారెడ్డి తో క‌లిసి గోవాకు వెళ్లింది. అక్క‌డ పొట్టి దుస్తుల‌లో దిగిన ఫొటోల‌ని ఇన్‌స్టాలో షేర్ చేయ‌డంతో ఇవి వైర‌ల్‌గా మారాయి. ఇక్క‌డ ఉన్న‌ప్పుడు ప‌ద్ద‌తిగా క‌నిపిస్తున్న స‌మంత ఇప్పుడు ది ఫ్యామిలీ మెన్‌2 అనే వెబ్ సిరీస్‌లో న‌టిస్తుండ‌గా, ఇందులో విల‌న్‌పాత్ర పోషిస్తుంది.ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన స‌ర్‌ప్రైజ్ రేపు న్యూ ఇయ‌ర్ గిప్ట్గా విడుద‌ల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *