సమంత‌కు నో చెప్పిన నాగ‌చైత‌న్య‌…..

అక్కినేని హాట్ క‌పుల్ నాగ‌చైత‌న్య,స‌మంత ఇప్ప‌టికే ప‌లు మూవీల్లో కలిసి న‌టించారు. పెళ్లి త‌రువాత వీరిద్ద‌రూ క‌లిసి న‌టించిన మ‌జిలీ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. ఈనేప‌థ్యంలో మ‌రోసారి వీరిద్ద‌రినీ వెండితెర‌పై జంట‌గా చూపించాల‌ని ఓ దర్శ‌కుడు అనుకున్నాడ‌ట‌. అయితే దానికి నాగ‌చైత‌న్య నో చెప్పేశాడ‌ట‌. నాగ‌చైత‌న్య ఇప్పుడు విక్ర‌మ్ కె. కుమార్ రూపొందిస్తున్న థాంక్యూలో న‌టిస్తున్నాడు.ఈ మూవీలో నాగ‌చైత‌న్య ఓ సామ‌న్య కుర్రాడిగా, బిజినెస్‌మేన్‌గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. హీరోయిన్ పాత్ర‌కు మూవీలో నాగ‌చైత‌న్య ఓ సామాన్య కుర్రాడిగా, బిజినెస్‌మేన్‌గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. హీరోయిన్ పాత్ర‌కు కూడా చాలా ప్రాముఖ్యం ఉంద‌ట‌. ఆ రోల్‌కు స‌మంత‌ను తీసుకుందామ‌ని విక్ర‌మ్ ప్ర‌పోజ్ చేశాడ‌ట‌. అయితే చైత‌న్య మాత్రం వ‌ద్ద‌న్నాడ‌ట‌. ఈ మ‌ధ్య‌నే తామిద్ద‌రం క‌లిసి ఓ మూవీ చేశామ‌ని, ఇప్ప‌ట్లో మ‌ళ్లీ వ‌ద్ద‌ని, వేరే హీరోయిన్‌ను చూడ‌మ‌ని చెప్పాడ‌ట‌. దీంతో మూవీ యూనిట్ అన్వేష‌ణ‌లో ప‌డింద‌ట‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *