స‌ల్లూ భాయ్ మూవీ రెండు ర‌కాలుగా ఏక‌కాలంలో విడుద‌ల‌కు రెడీ..

ఇప్పుడు స‌ల్మాన్ ఖాన్ న‌టించిన తాజా మూవీ రాధే మ‌ల్టీటాలెంటెడ్ ద‌ర్శ‌కుడు ప్ర‌భుదేవా తెర‌కెక్కించిన ఈ మూవీపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. కానీ అనూహ్యంగా కొవిడ్ మ‌ళ్ళీ అడ్డంకిగా మారింది. అయితే మ‌రి ఈ భారీ మూవీ విడుద‌ల పై గ‌త కొన్నాళ్ల నుంచి స‌స్పెన్స్ కొన‌సాగుతూ వ‌స్తున్న సంద‌ర్బంలో మేక‌ర్స్ ఆ స‌స్పెన్సును తెర‌దించారు. ఎట్టకేల‌కు ఈభారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీన్ని వ‌చ్చే మే13 న అటు థియేట‌ర్స్ లోనూ అలాగే ఓటీటీలో కూడా నేరుగా విడుద‌ల చేయ్యాల‌ని క‌న్ప‌ర్మ్ చేసారు. అయితే ఓటీటీలో జీ ప్లెక్స్ లోని పే ప‌ర్ వ్యూగా కొంత రుసుము చెల్లించి థియేట‌ర్స్ కు వెళ్ళి రిస్క్ తీసుకోము అన్న‌వారు చూసేలా తీసుకొచ్చారు. మొత్తానికి మాత్రం స‌ల్లూ భాయ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఇలా రెండు ర‌కాలుగా ఏక‌కాలంలో విడుద‌ల‌కు రెడీ అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *