విప్ల‌వం, ప్రేమ‌, మ‌హిళా సాధికార‌త‌తో ముడిప‌డి సాగుతుంది…

టాలీవుడ్ న్యాచుల‌ర్ స్టార్ సాయిప‌ల్ల‌వి, రానా కాంబినేష‌న్ వ‌స్తున్న మూవీ విరాట‌ప‌ర్వం డి. సురేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. వేణు ఊడుగుల ద‌ర్శ‌కుడు. ఇప్పుడు నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈనెల‌25న మూవీలోని తొలి గీతం కోలుకోలు లిరిక‌ల్ వీడియోను విడుద‌ల‌చేయ‌బోత‌న్న‌ట్లు సోమ‌వారం చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. సాయిప‌ల్ల‌వి పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది. ఇందులో కాక‌తీయ తోర‌ణం వ‌ద్ద డ్యాన్స్ చేస్తూ ఆమె క‌నిపిస్తోంది. ఈ పోస్ట‌ర్‌ను ఉద్దేశిస్తూ ప్రేమ‌లో మునిగి ఉన్న వెన్నెల అంటూ సాయిప‌ల్ల‌వి ట్విట్ట‌ర్‌లో వ్యాఖ్యానించింది. నిర్మాత మాట్లాడుతూ కోలు కోలు… పాట‌ను సాయిప‌ల్ల‌విపైన చిత్రీక‌రించాం. యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్ర‌మిది. విప్ల‌వం, ప్రేమ‌, మ‌హిళా సాధికార‌త‌తో ముడిప‌డి సాగుతుంది. ఏప్రిల్ 30న మూవీన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం. అని తెలిపారు. ప్రియ‌మ‌ణి, నందితాదాస్‌, నివేదా పేతురాజ్‌, న‌వీన్‌చంద్ర‌, జ‌రీనావ‌హాబ్‌, ఈశ్వ‌రీరావు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీకి సంగీతం ,సురేష్ బొబ్బిలి ,ఛాయాగ్ర‌హ‌ణం: డానీ సాంచెజ్ లోపెజ్, దివాక‌ర్ మ‌ణి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *