విరాట‌ప‌ర్వం ఏప్రిల్‌30న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది….

టాలీవుడ్ యంగ్ హీరో  రానా,సాయిప‌ల్ల‌వి క‌ల‌యిక‌లో లో వ‌స్తోన్న మూవీ విరాట‌ప‌ర్వం విష‌యం తెసిలిందే. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 30న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయనుందీ మూవీ. ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక‌ల్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఫిబ్ర‌వ‌రి 25న తొలి సాంగ్ కొలుకొలు లిరిక‌ల్ వీడియోను విడుద‌ల చేయ‌నున్నారు. సాయిప‌ల్ల‌వి గ్రీన్ అండ్ యెల్లో క‌ల‌ర్ లంగావోణిలో చారిత్ర‌క ప్ర‌దేశంలో డ్యాన్స్ చేస్తున్న స్టిల్‌ను మేక‌ర్స్ అంద‌రితో పంచుకున్నారు. సాయిప‌ల్ల‌వి న‌యాలుక్ చూస్తుంటే… ఈ భామ చేసే డ్యాన్స్‌కు అంద‌రూ ఫిదా అవ్వాల్సిందేన‌ని తెలిసిపోతుంది. సురేష్ బొబ్బిలి ఈమూవీకి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. ప్రియ‌మ‌ణి, నందితా దాస్, నివేదా పేతురాజ్‌, న‌వీన్‌చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావ్‌, సాయిచంద్ ముఖ్య‌పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. సుధాక‌ర్ చెరుకూరితో క‌లిసి సురేష్‌బాబు ఈ మూవీన్ని నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *