మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను గ‌మ‌నిస్తే రూపాయి కాయిన్ హైలెట్‌….

ప్ర‌స్తుతం హీరో మ‌హేష్‌బాబు- ప‌ర‌శురాం కాంబినేష‌న్‌లోవ‌స్తోన్న మూవీ స‌ర్కారు వారి పాట‌. రామోజీఫిలిం సిటీలో జ‌న‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఒక‌టి టాలీవుడ్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈమూవీ స్టోరీ లైన్ ఎలా సాగుతుంద‌నే దానికి సంబంధించిన గాసిప్ వైర‌ల్ అవుతోంది. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను గ‌మ‌నిస్తే రూపాయి కాయిన్ హైలెట్ గా క‌నిపిస్తుంది. కాయిన్ ఎర‌రేయ‌డం పోస్ట‌ర్ లో క‌నిపిస్తుంది. ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తూ వారిని దోపిడీ చేసి విదేశాల్లోకి పారిపోతున్న కేసుల‌ను మ‌హేష్‌బాబు డీల్ చేస్తాడ‌ని టాక్. ఇటీవ‌లే స‌ర్కారు వారి పాట మూవీ గ్రాండ్ లాంచ్ అయింది. మైత్రీమూవీ మేక‌ర్స్‌, జీఎంబీ ఎంట‌ర్ టైన్ మెంట్స్,14 రీల్స్ ప్ల‌స్ సంయుక్తంగా ఈ మూవీన్ని నిర్మిస్తున్నాయి. కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *