ఆలియాభ‌ట్ సీత పాత్ర‌లో పెప్పించ‌నున్నారు.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ,రామ్‌చ‌ర‌ణ్ మ‌ల్టీస్టార్ మూవీఆర్ ఆర్ ఆర్ తెలిసిన విష‌య‌మే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఆలియాభ‌ట్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తోన్న మూవీ ఆర్ ఆర్ ఆర్ ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఈ మూవీలో రామ్ చ‌ర‌ణ్‌కు జోడీగా ఆలియా క‌నిపించ‌నున్నారు. సీత పాత్ర‌లోఆమె మెప్పించ‌నున్నారు. శుక్ర‌వారం ఆలియా పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆర్ ఆర్ ఆర్ నుంచి ఆమె ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ చిత్ర‌బృందం షేర్ చేసింది. ఇప్పుడు ఈ లుక్ ప్ర‌తి ఒక్క‌ర్నీ ఆక‌ర్షిస్తోంది. ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న ఆర్ ఆర్ఆర్ లో చెర్రీకి జోడీగా ఆలియాభ‌ట్‌, ఎన్టీఆర్ జోడీగా హాలీవుడ్ న‌టీ ఒలీవియామోరీస్ సంద‌డి చేయ‌నున్నారు. దాదాపు రూ.400 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్నీ మూవీకి డీవీవీ దానయ్య నిర్మాత‌గావ్య‌వ‌హ‌రిస్తున్నారు. కీర‌వాణి స్వరాలు అందిస్తున్నారు. ద‌క్షిణాదితోపాటు బాలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టులు ఇందులో భాగ‌మ‌య్యారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న ఈ మూవీ అక్టోబ‌ర్ 13 న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *