ప‌వ‌న్ తో త్రివిక్ర‌మ్ కొత్త మూవీ….

టాలీవుడ్ అగ్ర‌హీరో ఇప్పుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తున్న వ‌కీల్ సాబ్ షూట్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇది లైన్‌లో ఉండ‌గానే ప‌వ‌న్ మ‌రిన్ని ఆస‌క్తిక‌ర ప్రాజెక్టుల‌కు లైన్ లో పెట్టేసారు. మ‌రి అలాంటి వాటిలో అయ్య‌ప్ప‌ణం కోషియం రీమేక్ కూడా ఒక‌టి. అనౌన్స్మెంట్ తోనే భారీ హైప్ తెచ్చుకున్న ఈ మూవీపై ఆ మ‌ధ్య అంతా ర‌క‌ర‌కాల గాసిప్స్ వినిపించాయి. ఇప్పుడు కూడా అలాగే మ‌రిన్ని ఆసక్తిక‌ర వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ మూవీకి గాను ప‌వ‌న్‌కు స‌న్నిహితుడు మ‌రియు టాలీవుడ్ టాప్ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ మాట‌లు అందిస్తుంన్నార‌ని ఓటాక్ వినిపించింది. కానీ ఇప్పుడు మ‌రోటాక్ ఏమిటి అంటే ఈ మూవీకి త్రివిక్ర‌మ్ స్క్రీన్‌ప్లే నుకూడా అందిస్తార‌ని గాసిప్స్ మొద‌ల‌య్యాయి. మ‌రి ఈ రెండు అంశాల‌పై కూడా ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు కానీ నిజ‌మైతే మాత్రం త్రివిక్ర‌మ్ ఈ మూవీకి ఒక రోల్ చేస్తున్న‌ట్టే అని చెప్పాలి.ఇక ఈ మూవీకి యువ ద‌ర్శ‌కుడు సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *