ఈ ఆచార్య కోసం ఇటీవ‌ల ఓ గ్రామం మొత్తం సెట్ వేశార‌ట‌

టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం ఆచార్య మూవీ చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే క‌రోనా కార‌ణంగా ఎంతో ఆల‌స్యం అయిన ఈ మూవీన్ని ఇక ఆల‌స్యం కాకుండా పూర్తి చేయాల‌ని చిరు ఆలోచించాడు. దాంతో త‌న షెడ్యూల్‌ను కూడా ఎంతో టైట్‌చేసుకొని మ‌రీ షూటింగ్‌ను పూర్తి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. అయితే ఈమూవీ కోసం ఇటీవ‌ల ఓ గ్రామం మొత్తం సెట్ వేశార‌ట‌. దానికి దాదాపు రూ.20 కోట్లు ఖ‌ర్చ‌యింద‌ట‌. అయితే మొద‌ట‌గా ఓ గుడి సెట్‌ను వేశార‌ట దానికి రూ.4 కోట్లు అయ్యాయ‌ట‌. అక్క‌డ కొన్ని ముఖ్య‌మైన స‌న్నివేశాల‌ను చిత్ర యూనిట్ రూపొందించింది. అయితే ఇప్పుడు కేర‌ళాలోని ఒక గ్రామం సెట్‌ను హైద‌రాబాద్‌లో వేశారు. దాంతో గుడితో క‌లుపుకొని వారికైన ఖ‌ర్చు రూ.20 కోట్లు.ఈ గ్రామం సెట్ దాదాపు 16 ఎక‌రాల విస్తీర్ణంతో వేశార‌ని, ఈ సెట్‌కు కావ‌ల‌సిన వాట‌న్నింటిని ద‌ర్శ‌కుడుకొర‌టాల శివ ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నాడు. ఈ మూవీ షూటింగ్ వ‌చ్చే ఏడాది జ‌న‌వరీలో తిరిగి మొద‌లు కానుంది. ఇప్ప‌టికి కొర‌టాల శివ దాదాపు 40శాతం షూటింగ్‌ను పూర్తి చేశారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో అంచ‌నాలు ఆకాశానికి ఎగసాయి. మ‌రి మూవీ ఆ అంచ‌నాల‌ను తాకుతుందోలేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *