క్రాక్ మూవీ ట్రైట‌ర్ దుమ్ములేపేస్తుంది..

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో మాస్ మ‌హారాజ ర‌వితేజ హీరోగా న‌టించిన లేటెస్ట్ ప‌క్కా మాస్ మ‌సాలా ఎంట‌ర్టైనెర్ మూవీ క్రాక్ త‌న‌సాలిడ్ కాంబిష‌న్‌లో గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ హై వోల్టేజ్ కాప్ డ్రామా నుంచి నిన్న‌నే ట్రైట‌ర్ విడుద‌ల అయ్యింది. మ‌రి ఈ మాస్ ట్రైల‌ర్ చూసాక ఈ మూవీపై అంచ‌నాలు మ‌రింత స్థాయిలో పెరిగిపోయాయి. ఇక ఇక్క‌డ నుంచి ఈ మూవీ విడుద‌ల కోసం అంతా ఎదురు చూడ‌డం మొద‌లు పెట్టారు. మ‌రి ఈ గ్యాప్ లో ఈ ట్రైల‌ర్ దుమ్ము లేపేస్తుంది. ఇంకా 24 గంట‌లు పూర్తి కాక‌ముందే భారీ వ్యూస్ మ‌రియు లైక్స్ లో ర‌వితేజ కెరీర్ లోనే రికార్డు సెట్ చేసింది. కేవ‌లం 20 గంట‌ల్లోనే 6.2 మిలియ‌న్ వ్యూస్ కొల్ల‌గొట్ట‌డ‌మే కాకుండా యూట్యూబ్‌లో నెంబ‌ర్1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. అంతే కాకుండా దాదాపు 2ల‌క్ష‌ల మేర‌లైక్స్ సాధించి ర‌వితేజ కెరీర్ లోనే సాలిడ్ రీచ్ అందుకున్న ట్రైట‌ర్‌గా నిలిచింది. ఇక ఈ మూవీలో ర‌వితేజ స‌ర‌స‌న శృతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌గా ర‌విశంక‌ర్‌, స‌ముథ్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మి శ‌రత్‌కుమార్ లు ప‌వ‌ర్ పుల్ విల‌న్స్‌గా క‌నిపిస్తున్నారు. అలాగే థ‌మ‌న్ సంగీతం అందించిన ఈ మూవీన్ని ఠాగూర్ మ‌ధు నిర్మాణం వ‌హించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *