చిన్న ప్రీలూడ్‌తోనే కేక పుట్టిస్తోన్న పుష్ప‌రాజ్‌…

టాలీవుడ్ అగ్ర‌హీరో స్టైలిస్టార్ అల్లుఅర్జున్‌, క‌న్న‌డ‌బ్యూటీ ర‌ష్మికమంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న మూవీ పుష్ప విష‌యం తెలిసిందే. ఈమూవీ క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్నారు, మైత్రీ చిత్రం మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ మూవీన్ని ప్రీలూడ్ విడుద‌లైంది. క‌నీక‌ప‌డ‌నీ బ‌న్నీ అల్లుఅర్జున్ అడ‌వుల్లో ప‌రిగెడుతున్న విజువ‌ల్ ఫ్యాన్స్ కు తెగ న‌చ్చేస్తోంది. ఇక ఈ నెల‌7న పుష్ప‌రాజ్ పాత్ర‌ను ప‌రిచ‌యం చేస్తామ‌ని ఈ ప్రీలూడ్ లో ప్ర‌క‌టించేశారు. మేక‌ర్స్‌, దీంతో బ‌న్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవ‌థులు లేవు. చిన్న ప్రీలూడ్ తోనే కేక పుట్టిస్తున్న బన్నీ ఇక పాత్ర ప‌రిచ‌యంలో ఎలా రెచ్చిపోతాడో అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో మ‌ల‌యాళ‌స్టార్ హీరో ఫ‌హాద్ ఫాజిల్ ఇందులో బ‌న్నీకి విల‌న్‌గా న‌టిస్తుండ‌గా జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాశ్‌రాజ్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. తెలుగులో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈమూవీ విడుద‌ల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *