త‌మిళ‌వాసుల ఇంటి కోడ‌లిని కావాల‌న్నదే నా కోరిక‌…

ప్ర‌స్తుతంర‌ష్మిక‌మంద‌న‌,అల్లుఅర్జున్‌ న‌టిస్తున్న పుష్ప‌మూవీలో న‌టిస్తుంది. ఇటూ టాలీవుడ్ అటూ బాలీవుడ్ న‌టిస్తూ బిజీగా ఉంది. గ‌త సంవ‌త్స‌రం నేష‌న‌ల్ క్ర‌ష్ ఆఫ్ ఇండియాగా ఎంపికై యువ ప్రేక్ష‌కుల‌న్ని గిలిగింత‌లు పెట్టింది. త‌మిళంలో కార్తి స‌ర‌స‌న సుల్తాన్ మూవీలో న‌టించి అక్క‌డి ప్రేక్ష‌కుల‌ను చేరువైంది. కొత్త‌గా పెళ్లిపై స్పందిస్తూ మ‌న‌సులోని మాట‌ను వెల్ల‌డించింది. నాకు త‌మిళ సంస్కృతి, సంప్ర‌దాయం అంటే చాలా ఇష్టం. అక్క‌డి భోజ‌నం, ఆహార ప‌దార్థాలు చాలా రుచిక‌రంగా ఉంటాయి. ఎప్ప‌టికైనా త‌మిళ‌వాసుల ఇంటి కోడ‌లిని కావాల‌న్న‌దే నా కోరిక అంటూ మ‌దిలోని మాట‌ను వెల్ల‌డించింది. ర‌ష్మిక గ‌తంలోనే క‌న్న‌డ హీరో ర‌క్షిత్ శెట్టిలో ప్రేమాయ‌ణం న‌డిపి నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ, ఆ పెళ్లి ఎందుకో ఆగిపోయింది. ఇప్పుడు ఈ అమ్మ‌డు తెలుగులో అల్లు అర్జున్‌తో క‌లిసి పుష్ప మూవీలో న‌టిస్తోంది.శ‌ర్వానంద్ క‌థానాయ‌కుడిగా చేస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు లోనూ నాయిక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్లో సిద్దార్థ‌మ‌ల్హోత్రా స‌ర‌స‌న మిష‌న్ మ‌జ్ను తోపాటు అమితాబ్ బ‌చ్చ‌న్ క‌లిసి గుడ్‌బై మూవీలో చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *