నేను దీన్ని ప్రేమిస్తున్నాను….

హైద‌రాబాద్‌: టాలీవుడ్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా, అల్లు అర్జున్ క‌లిసి న‌టిస్తున్న‌మూవీ పుష్ప సంగ‌తి తెలిసిందే. ఆమె ప‌లు ప్రాజెక్టుల‌లో ప‌నిచేస్తుంది. ర‌ష్మిక త‌న చేతి ఉంగ‌రాన్ని చూసుకోని మురిసిపోతుంది. త‌న‌కు అత్యంత ప్రియ‌మైన వ్య‌క్తులు నుంచి ఈ ఉంగ‌రం అందింద‌ట‌. త‌న‌కందిన ఆ అపురూప కానుక‌ని ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది. ఆమె ఇది నాకు ఎవ‌రు పంపారో తెలుసు. దీన్ని నేను అందుకున్నా. నేను మీర‌హాస్య సందేశాన్ని చ‌దివాను. నాకిది స‌రిగ్గా స‌రిపోయింది. నేను దీన్ని ప్రేమిస్తున్నాను. అంటూ ర‌ష్మిక ఆఫొటోకి ఓ వ్యాఖ్య‌నికూడా జ‌త చేసింది. దీంతో ఇప్పుడి ఉంగ‌రం క‌థ కాస్తా నెట్టింట వైర‌ల్‌గా మారిపోయింది. ర‌ష్మిక ఇప్పుడు వ‌రుస మూవీల‌తో బిజీగా ఉంది. త‌మిళంలో ఆమె ఎంట్రీ ఇస్తున్న సుల్తాన్ ఏప్రిల్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో కార్తి క‌థానాయ‌కుడిగా నటిస్తున్నాడు. మిష‌న్‌మ‌జ్ను, ఆడాళ్లు వీకు జోహార్లు మూవీల్లో న‌టిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *