ఆచార్య మూవీలో చెర్రీకి జోడిగా ర‌ష్మిక మంద‌న్న‌…..

టాలీవుడ్ అగ్ర‌హీరో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్ ఇప్ప‌టికి మొద‌లైపోయింది. కొన్ని రోజులు చిరు లేకుండానే షూటింగ్ చేశారు. కొర‌టాల శివ‌. తాజాగా చిరు షూటింగ్లో అడుగుపెట్టిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం చిరు మీద యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంద‌ట‌. కాగా మూవీలోరామ్‌చ‌ర‌ణ్ కూడా ఒక కీల‌క పాత్ర చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇన్నాళ్ల‌పాటు మూవీలో చ‌ర‌ణ్‌కు జోడిగా ఎవ‌రు న‌టిస్తార‌నేది రివీల్ కాలేదు. మ‌ధ్య‌లో ప‌లువురు బాలీవుడ్ హీరోయ‌న్ల పేర్లు వినిపించినా ఇప్పుడు మాత్రం యంగ్ అండ్ లేటెస్ట్ సెన్సేష‌న్ ర‌ష్మిక మంద‌న్న క‌థానాయ‌కిగా ఖరారైన‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ విష‌య‌మై ఆచార్య టీమ్ నుండి ఇంకా అఫీషియ‌ల్ క‌న్ప‌ర్మేష‌న్ రావాల్సింది. జ‌న‌వ‌రి మూడో వారంలో ఆచార్య సెట్లోకి అడుగుపెడ‌తార‌ట రామ్‌చ‌ర‌ణ్‌. అప్పుడే ర‌ష్మిక కూడా షూటింగ్‌లో పాల్గొంటుంద‌ని, ఒకే షెడ్యూల్లో వీరిద్ద‌రికీ సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌కు పూర్తిచేస్తార‌ని ఫిల్మ్ న‌గ‌ర్‌టాక్‌. కొర‌టాల త‌న ఎవ‌రు గ్రీన్ ఫార్ములా అయినా క‌మ‌ర్షియాలిటీ, సోష‌ల్ మెసేజ్ జోడించి ఈ మూవీన్ని తెర‌కెక్కిస్తున్నారు మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ ఈ మూవీన్ని సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *