నితిన్ రంగ్‌దే విదేశాల‌ల్లో మంచి క్రేజ్‌లో ఉంది…

rangde,movieshoot-progressing,now,in,dubaiటాలీవుడ్ హీరో నితిన్ త‌న లేటెస్ట్ మూవీ..భీష్మ‌తోమంచి సాలిడ్ కం బ్యాక్ అందుకున్న టాలీవుడ్ యూత్‌స్టార్ నితిన్ అదే ఫామ్ ను కొన‌సాగించ‌డానికి మొద‌లు మ‌రో క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ రంగ్‌దే. యంగ్ అండ్ టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీపై మంచి అంచ‌నాలు కూడా నెల‌కొన్నాయి. అలాగే ఇప్ప‌టికే వ‌చ్చిన పోస్ట‌ర్స్ మ‌రియు టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ కూడా వ‌చ్చింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ మూవీ షూటింగ్‌పై అప్డేట్ బ‌య‌ట‌కొచ్చింది. ప్ర‌స్తుతం మేక‌ర్స్ కొన్ని కీల‌క స‌న్నివేశాల‌కు గాను దుబాయ్ ప‌య‌న‌మ‌య్యారు. ఇప్పుడు ఈ షూట్ లోనే హీరో నితిన్ అలాగే హీరోయిన్ కీర్తి సురేష్‌లు ఈషూట్‌లో పాల్గొన్నారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తుండ‌గా సితార ఎంట‌ర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. అలాగే మేక‌ర్స్ ఈ మూవీన్ని సంక్రాంతి విడుద‌లకు ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *