విరిద్ద‌రి కాంబినేష‌న్ లో మ‌రో మూవీ..

టాలీవుడ్ అగ్ర‌హీరో రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబీనేషన్‌లో ఆర్ ఆర్ ఆర్ మూవీ వ‌స్తుంద‌ని విష‌యం తెలిసిందే. త‌మిళ దర్శ‌కుడు శంక‌ర్ ,రామ్‌చ‌ర‌ణ్ క‌ల‌యిక‌లో మూవీ ప్ర‌క‌ట‌న సంచ‌లనం సృష్టించింది. ఇక అప్ప‌టి నుండి ఆ మూవీ గురించి ప‌లుర‌కాల వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మూవీలో రామ్‌చ‌ర‌ణ్ జోడిగా ప‌లువురు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కొత్త‌గా ఈ మూవీలో క‌థానాయిక‌గా అలియాభ‌ట్ న‌టిస్తున్నారంటూ త‌మిళ సినీ వ‌ర్గాల స‌మాచారం. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలోతెర‌కెక్క‌కుతుండ‌టంతో బాలీవుడ్ హీరోయిన్‌ను ఎంపిక చేయాల‌ని శంక‌ర్ భావిస్తున్నార‌ట‌. ప‌లువురి పేర్ల‌ను ప‌రిశీలించినా చివ‌ర‌కు అలియా అయితే బాగుంటుంద‌ని శంక‌ర్ భావించార‌ట‌. ఆర్ ఆర్ ఆర్ మూవీలో వీరు ఇద్ద‌రు క‌లిసి న‌టిస్తున్న సంగ‌తితెలిసిందే. దిల్‌రాజ్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ పాటికే సెట్స్ పై కి వెళ్లాల్సి ఉంది. ఇండియ‌న్2 చిత్రీక‌ర‌ణ పూర్తికాక‌పోవ‌టం న్యాయ‌వివాదాల నేప‌థ్యంలో శంక‌ర్ ఈ మూవీపై పూర్తి స్థాయిలో ఫోక‌స్ పెట్ట‌లేక‌పోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *