ఎన్టీఆర్ అభిమానుల‌కు తీపిక‌బురు!

ఇప్పు‌డు ఎన్టీఆర్ ,రామ్‌చ‌ర‌ణ్ క‌లసి ఆర్ ఆర్ ఆర్ మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్టుకావ‌డంతో ఎన్టీఆర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.ఇప్పుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ మూవీ మాట‌ల‌మాంత్రికుడు త్రివిక్ర‌మ్ , యంగ్‌టైగ‌ర్ మ‌రో సారి మూవీ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. తార‌క్ అభిమానుల‌కు ఓ తిపిక‌బురు ఇద్ద‌రు కాంబినేష‌న్‌లో మ‌రో మూవీ రావ‌డం ఆనంద‌‌కర‌మైన విష‌యం చెప్ప‌త‌ప్ప‌దు. ఎన్నో రోజుల నుంచి అభిమానులు ఎదురుచూస్తున్నారు.దీనికి సంబంధించిన అప్‌డేట్ని ఏప్రిల్ 12న ఇవ్వ‌నున్న‌ట్టు మూవీ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. తార‌క్ 30 వ‌ర్కింగ్ టైటిల్‌తోహాసిని క్రియేష‌న్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు ఈ మూవీన్ని నిర్మిస్తున్నాయి. మ‌రి ఆ స‌ర్‌ప్రైజ్ ఏంటో తెలియాలంటే కొన్ని గంట‌లు వేచి చూడాల్సిందే. అర‌వింద‌స‌మేత‌,త‌రువాత ఎన్టీఆర్- త్రివిక్ర‌మ్ క‌లయిక‌లో రూపొందుతున్న మూవీ కావ‌డంతో అంచ‌నాలు భారీగా పెరుగుతున్నాయి. గ‌త సంవ‌త్స‌రం ఈప్రాజెక్టుని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికి లాక్‌డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *