మాఇద్ద‌రి కాంబినేష‌న్‌లో మూవీ తప్ప ఉంటుంది…

టాలీవుడ్ లో మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ త‌న మూవీలో పాత్ర‌ల‌కు న‌టుల‌ను ఆచితూచి ఎంచుకుంటాడు. అందుకే అత‌డి మూవీ అంటే అభిమానులు ఓ రేంజ్‌లో ఊహించుకుంటారు. వారి ఊహాల‌కు త‌గ్గ‌ట్టుగానే త్రివిక్ర‌మ్ కూడా చిత్రంను తీర్చిదిద్దుతాడు. అయితే త్రివిక్ర‌మ్ త‌న తొలి మూవీఅ.ఆ త‌ప్పితే మిగిలిన అన్ని మూవీలు స్టార్ హీరోల‌తోనేతెర‌కెక్కించాడు. ప్ర‌తి హీరోతో చేసిన మూవీతో ఆయా హీరో అభిమానుల‌ను మెప్పించాడు. మ‌హేష్ రెండు సార్లు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, అల్లుఅర్జున్‌తో మూడు స్లారు వీరి కాంబినేష‌న్‌లో అంటేనే అభిమానుల ఆనందానికి వ్య‌వ‌ధులు లేకుండా పోతున్నాయి. ఇదిలా ఉంటే మ‌రో ప‌క్క రామ్ పోత‌నేనితో త్రివిక్ర‌మ్ మూవీ చేయ‌నున్నాడ‌ని వార్త‌లు వినిపించాయి. రామ్ కూడా ఇస్మార్ట శంక‌ర్ మూవీతో భారీ హిట్ అందుకున్నాడు. మ‌ళ్లీ ప్ర‌స్తుతం రెడ్ మూవీతో మాస్ ఫ్యాన్స్ ముందుకి వ‌స్తున్నాడు. ఇందులో రెండు పాత్ర‌ల్లో రామ్ క‌నిపించ‌నున్నాడు. అంతేకాకుండా వీటీలో ఒక‌టి పూర్తి మాస్ అయితే మ‌రోక‌టి పూర్తి క్లాస్‌గా క‌న‌పించ‌నున్నాయి. ఈ మూవీ ఈనెల 14న‌విడుద‌ల కానుంది. ఈ కార్యక్ర‌మంలో రామ్ త్రివిక్ర‌మ్ మూవీల‌పై కామెంట్ చేశాడు. త‌మ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో మూవీ త‌ప్ప‌క ఉంటుంది. ఇంత‌కుముందే దీనిపై చ‌ర్చించాం.అయితే అది ఎప్పుడు మొద‌ల‌వుతుందో తెలియ‌దు. దానికి కాస్త స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయి. అన్న‌ట్లుగా రామ్ అన్నాడు. అంతేకాకుండా ఇప్పుడు ప‌రిస్థితుల్లో వీరి కాంబినేష‌న్‌లో ఆల‌స్యం అయ్యేందుకు అవ‌కాశాలు బాగానే ఉన్నాయి. దీనిపై మ‌రింత స‌మాచారం కోసం వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *