క్రేజీ కాంబినేష‌న్‌లో సెట్ అవుతుందో లేదో చూడాలి…

టాలీవుడ్ లో ఇస్మార్ట శంక‌ర్‌, లాంటి భారీ బ్లాక్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత యువ హీరో రామ్ చేసిన చిత్రం రెడ్ కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ జ‌న‌వ‌రి 14వ తేదీన విడుద‌ల‌కానుంది. ఈ మూవీపై ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాలున్నాయి. ట్రైల‌ర్, పాట‌లు ఆక‌ట్టుకోవ‌డంతో మూవీ మీద బ‌జ్ పెరిగింది. ఇదిలా ఉండ‌గా చాలా రోజుల నుండి రామ్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక మూవీ చేస్తాడ‌నే వార్త‌కు విశేషంగా వినిపిస్తున్నాయి. ఇస్మార్ట్ శంక‌ర్ త‌రువాత వీరి మూవీనే ప‌ట్టాలెక్కుతుంద‌ని అంతా అనుకున్నారు. త్రివిక్ర‌మ్ సైతం అల‌వైకుంఠ‌పుర‌ములో త‌రువాత వేరే కొత్త మూవీ ఏదీ క‌మిట‌వ్వ‌లేదు. దీంతో ప్రాజెక్ట్ క‌న్ఫ‌ర్మ్ అనుకున్నారు. కానీ ఇప్ప‌టిటీ ఎలాంటి అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ రాలేదు. తాజాగా రెడ్ మూవీ ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొన్న రామ్ త్రివిక్ర‌మ్ మూవీ గురించి మాట్లాడుతూ ఆ ప్రాజెక్ట్ ఇంకా చ‌ర్చ‌లు ద‌శ‌లోనే ఉంద‌ని, ఫైన‌ల్ కాలేద‌ని,త్వ‌ర‌లోనే ఏదో ఒక‌టి తేలుతుంద‌ని అన్నారు. మ‌రి ఈ చ‌ర్చ‌ల్లో వీరి క్రేజీ కాంబినేష‌న్ సెట్ అవుతుందో లేదో చూడాలి. ఇక‌పోతే రామ్ త‌ర‌చూ క‌థ‌లు వింటున్నా కూడా రెడ్ త‌రువాత ఎవ‌రితో వ‌ర్క్ చేస్తారనేది ఇంకా క‌న్ఫ‌ర్మ్ కాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *