ర‌జినీకాంత్ ఆరోగ్యం తొంద‌ర‌గా కోలుకోవాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను

కోలివుడ్ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ అస్వ‌స్థ‌త‌తో హైద‌రాబాద్ లోని ఆసుప‌త్రిలో చేరిన‌ట్లు తెలినిన విష‌య‌మే. ప‌వ‌న్ స్టార్ క‌ళ్యాణ్ ఆయ‌న ఆసుపత్రిలో చేరినట్లుగా తెలిసి చాలా బాధ‌ప‌డ్డాను అని అన్నారు. ఆ త‌రువాత క‌రోనా ల‌క్ష‌ణాలు లేవ‌ని వైద్యులు ప్ర‌క‌టించ‌డం ఊర‌ట‌నిచ్చింది. అని మ‌నోధైర్యం మెండుగా ఉన్ ర‌జ‌నీకాంత్ గారు త్వ‌ర‌లో కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక‌ప‌రులైన ఆయ‌న‌కు భ‌గ‌వ‌ద‌నుగ్ర‌హం క‌ల‌గాలి. ఆయ‌న ఎంత‌గానో విశ్వ‌సించే మ‌హావ‌తార్ బాబాజీ ఆశీస్సుల‌తో సంపూర్ణ ఆరోగ్యంతో మ‌న ముందుకు రావాల‌ని కోరుకొంటున్నాను అని తెలిపారు. అయితే ఈ రోజు ఉద‌యం ర‌క్త‌పోటు అధికం కావ‌డంతో ర‌జినీని అపోలో ఆస్ప‌త్రిలో చేర్చించారు. సిబ్బంది ప్ర‌స్తుతం రాజ‌నీకాంత్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని సాయంత్రానికి డిశ్చార్జ్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *