మంచి నిర్ణ‌యం తీసుకున్నావు మిత్ర‌మా!

కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ అన్నాత్తే చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో అస్వ‌స్థ‌త‌కు లోనై, హైద‌రాబాద్‌లోనిఅపోలో ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్న విష‌యం తెలిసిందే. చికిత్స అనంత‌రం నో పాలిటిక్స్. అంటూ ప్ర‌క‌టించ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశమైంది. ఈ నేప‌థ్యంలో ర‌జినీ స్నేహితుడు మోహ‌న్‌బాబు స్పందించి ఓ లేఖ‌ని రిలీజ్ చేశారు. ఓ మిత్రుడిగా ర‌జ‌నీ ఆరోగ్యం గురించి పూర్తిగా తెలిసిన వ్య‌క్తిగా త‌ను రాజ‌కీయాల్లోకి రాక‌పోవ‌డం మంచిద‌ని న‌మ్ముతున్నాను. నా స్నేహితుడితో ఎన్నో సంద‌ర్బాల్లో చెప్పాను. నువ్వు చాలా మంచివాడివి. చీమ‌కు కూడా హాని చేయ‌నివాడివి. నీలాంటి వ్య‌క్తికి, నాలాంటి వ్య‌క్తికి రాజ‌కీయాలు ప‌నికిరావు. ఎందుకంటే మ‌నం ఉన్న‌ది ఉన్న‌ట్టు నిక్క‌చ్చినా మాట్లాడ‌తాం. ఎవ‌రికి ద్రోహం చెయ్యం. డ‌బ్బులిచ్చి ఓట్లు కొనలేం, కొనం కూడా. ఇక్క‌డ ఎవ‌రిని న‌మ్మాలో, ఎవ‌రిని న‌మ్మ‌కూడ‌దో తెలియ‌దు. రాజ‌కీయాల్లోకి రానంత వ‌ర‌కు మంచివాడివిఅన్న నోళ్లే ,రేపు వ‌చ్చాక చెడ్డ‌వాడివి అంటాము. రాజ‌కీయం ఒక రొచ్చే..ఒక బుర‌ద‌.. ఆ బుర‌ద అంటుకోకుండా నువ్వు రాక‌పోవ‌డ‌మే మంచింది అయింది.ర‌జినీకాంత్ అభిమానులందరూ ర‌జినీకాంత్ అంత మంచివాళ్లు .మీరంద‌రూ స‌హ ద‌యంతోనా మిత్రుడి నిర్ణ‌యాన్ని అర్థం చేసుకుంటార‌ని ఆశిస్తున్నాను, అని మోహ‌న్‌బాబు త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *