ర‌జినీ రాజ‌కీయాలలోకి రావలంటూ అభిమానుల ఆందోళ‌న‌..

కోలీవుడ్ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ అన్యారోగ్యం వ‌ల‌న తాను రాజ‌కీయాల‌లోకి రాలేనంటూ ఈమ‌ధ్య ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీనిని అభిమానులు ఏమాత్రం జ‌ర్ఞించుకోలేక‌పోతున్నారు. ఆయ‌న దిష్టిబొమ్మ‌లు త‌గ‌ల‌బెట్ట‌డం, ఇంటి ముందు నిర‌స‌న‌లు, ర్యాలీలు చేయ‌డం వంటివి చేస్తున్నారు. తాజాగా మురుకేష‌న్ అనే వ్య‌క్తి ర‌జినీ త‌న నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని త‌న‌కు తాను నిప్పంటించుకుని ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించాడు. మురుకేస‌న్‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించిన పోలిసులు ఇప్పుడు వైద్యం అందిస్తున్నారు. ర‌జ‌నీకాంత్ త‌న నిర్ణయం ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుండి త‌మిళ‌నాట భారీ ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి.వీటికి త‌లైవా ఎలా చెక్ పెడ‌తాడ‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నాత్తె షూటింగ్ కోసం హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ర‌జ‌నీ హైబీపీ వ‌ల‌న ఆసుప‌త్రిలో అడ్మిట్ అయ్యారు. మూడు రోజుల త‌రువాత డిశ్చార్జ్ చేయ‌గా, ప్ర‌త్యేక ప్లైట్‌లోచెన్నైకు వెళ్ళారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *