ర‌జినీ కాంత్ రోజు 14 గంట‌లు షూటింగ్ చేస్తున్నార‌ట‌…

త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ న‌టిస్తున్న మూవీ అన్నాత్తే,శివ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ రూపొందుతోంది.లాక్‌డౌన్ కార‌ణంగా వాయిదాప‌డిన ఈమూవీ ఈ మ‌ధ్య‌నే రీస్టార్ అయింది. హైద‌రాబాద్‌లోని రామోజీఫిలింసిటీలో షూటింగ్ జ‌రుగుతోంది. మూవీన్ని వీలైనంత త్వ‌ర‌గా పూర్తచేయాల‌ని చూస్తున్నారు. ర‌జినీ, డిసెంబ‌ర్ 31న ఆయ‌న త‌న పొలిటిక‌ల్ పార్టీ గురించి కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. పార్టీ పేరు, ఎన్నిక‌ల గుర్తును అధికారికంగా రివీల్ చేయ‌నున్నారు. వ‌చ్చే సంవ‌త్స‌రంలోనే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు ఉండ‌టంతో జ‌న‌వ‌రి నుండి ర‌జినీ పూర్తిగా రాజ‌కీయ ప‌ర‌మైన ప‌నుల్లో నిమ‌గ్నం కానున్నారు. పార్టీ ముఖ్యుల‌తో భేటీలు, అభిమానుల‌తో స‌మావేశాలు ,ర్యాలీలు, బ‌హిరంగ‌స‌భ‌లు, అభ్య‌ర్థుల ఎంపిక ఇలా అనేక ర‌కాల ప‌నుల‌తో పూర్తిగా బిజీ అయిపోతారు. అందుకే ఈలోపు మూవీన్ని ముగించాల‌ని చూస్తున్నారు. ఇంకా 40శాతం వ‌ర‌కు చిత్రీక‌ర‌ణ మిగిలి ఉంది. అందుకే రోజుకు 14 గంట‌ల పాటు షూటింగ్ చేస్తున్నార‌ట‌. సూప‌ర్‌స్టార్ .కీర్తి సురేష్‌, మీనా,ఖుష్బూలు ఇందులో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు జాకీష్రాఫ్ ప్ర‌తినాయకుడి పాత్ర చేస్తున్నారు. ర‌జినీకి జోడిగా న‌య‌న‌తార న‌టిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *