రాధేశ్యామ్ బిగ్ స్క్రీన్ పైనే-ప్ర‌భాస్ అండ్ టీం ఫిక్స్

రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న చిత్రం రాధేశ్యామ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్-పూజా హెగ్డే కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన చిత్రంరాధేశ్యామ్‌. ఈ చిత్రం వారం షెడ్యూల్ మిన‌హా షూటింగ్ పూర్తి చేసుకుంది. హైబ్రిడ్ బేసిస్ విధానంలో రాధేశ్యామ్ ను విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వచ్చాయి. అంటే ఓటీటీలో పే ప‌ర్ బేసిస్ తోపాటు ఓవ‌ర్సీస్ బిగ్ స్క్రీన్స్ లో కూడా విడుద‌ల చేయ‌డం.ఇదే కాకుండా మేక‌ర్స్ కు చాలా ఆఫ‌ర్లు కూడా వ‌చ్చాయట‌. కానీ యూవీ క్రియేష‌న్స్ అండ్ ప్ర‌భాస్ మాత్రం ఓటీటీ లో విడుద‌ల‌కు నో చెప్పార‌ట‌. లాక్ డౌన్ పూర్త‌యి థియేట‌ర్లు రీఓపెన్ అయిన త‌ర్వాత రాధేశ్యామ్ ను రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని టాక్‌. రాధేశ్యామ్ బిగ్ స్క్రీన్ పైనే ప్రేక్ష‌కుల‌కు చూపించాల‌ని ప్ర‌భాస్ అండ్ టీం ఫిక్స్ అయింద‌ని ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్ లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *