ద‌స‌రా కానుక‌గా ఆర్ ఆర్ ఆర్ మూవీ డేట్స్‌ఫిక్స్‌

టాలీవుడ్‌లో ఇప్పుడు మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌రియు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ల‌తో ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జేట్ పీరియాడిక్ మూవీ రౌద్రం ర‌ణం రుధిరం అంశంలోనూ భారీ అంచ‌నాలు సెట్ చేసుకున్న ఈ మూవీ విడుద‌ల కోసం దేశ వ్యాప్తంగా జ‌నం ఎదురు చూస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ ను జ‌రుపుకుంటున్న ఈ మూవీ అంతిమ ద‌శ‌లో ఉంది.మ‌రి ఈ మూవీన్ని జ‌క్క‌న ఎప్ప‌టికి ప్లాన్ చేస్తున్నారో అన్న టాక్ వినిపిస్తుంది. మొద‌ట ప‌లు డేట్స్ అనుకున్నారు. కానీ రాజ‌మౌళి ఫైన‌ల్ గా ఈ మూవీన్ని ద‌స‌రా కానుక‌గానే తీసుకు రావాల‌ని అనుకుంటున్న‌ట్టుగా వినికిడి. అప్ప‌టికి మెరుగైన ప‌రిస్థితులు ఉంటాయి. పైగా మంచి సీజ‌న్ కాబ‌ట్టి అలా ప్లాన్ చేసే స‌న్నాహాల్లో ఉన్నార‌ని టాక్. ఇప్ప‌టికే రాజ‌మౌళి డిజైన్ చేసిన రోల్స్ లో తార‌క్ మ‌రియు చ‌ర‌ణ్ ల‌కు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ ఆల్ ఓవ‌ర్ ఇండియా వ‌స్తుంది. మ‌రి రాజామౌళి ఈ మూవీన్ని అప్ప‌టికే ఫిక్స్ చేస్తారా లేదా అన్న‌ది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *