పుష్ప మూవీ నుంచి విజ‌య్‌సేతుప‌తి ఔట్‌….

టాలీవుడ్ అగ్ర‌హీరో స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ క‌ల‌యిక‌లో రాబోతున్న పుష్ప మూవీలో మొద‌ట త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తి ఓ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించాలి. కానీ క‌రోనా కార‌ణంగా షెడ్యూల్స్ అన్ని మిస్ అయి.. డేట్స్ అన్ని క్రాస్ అయి మొత్తానికి విజ‌య్ సేతుప‌తి ఈ మూవీ
నుండి త‌ప్పుకున్నాడు. ఇప్పుడు ఈ పాత్ర కోసం విజ‌య్ సేతుప‌తి లాంటి మ‌రో హీరో కోసం పుష్ప టీమ్ వెతుకుటాల మొద‌లెట్టింది. మ‌రి విజ‌య్ సేతుప‌తి లాంటి హీరో… పైగా త‌మిళం లాంటి భాష‌లో పుల్ క్రేజ్‌ ఉన్న హీరో దొర‌క‌డం అంటే క‌ష్ట‌మే. మ‌రి చూడాలి ఎవ‌ర్ని తీసుకుంటారో . ఇక ఈ సినిమాలోని స్పెష‌ల్ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శి రౌటెలా న‌టిస్తోంది. అలాగే వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న ర‌ష్మిక మంద‌న్న ఈ మూవీలో ఓ గిరిజ‌న యువ‌తి పాత్ర‌లో న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం శేషాచ‌లం అడవుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగ‌నుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్మ‌గ్ల‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మ‌రి బ‌న్నీ పుష్ప కూడా సూప‌ర్ హిట్ అవుతుందేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *