ఆదిపురుష్ మూవీ కోసం నిర్మాత‌లు 1000 కోట్లు పెట్టాడానికి రెడీ…

టాలీవుడ్ అగ్ర‌హీరో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న ప‌లు భారీ పాన్ ఇండియ‌న్ మూవీల్లో ఆదిపురుష్ కూడా ఒక‌టి. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓంరౌత్ తెర‌కెక్కించ‌నున్న ఈభారీ ఇతిహాస మూవీపై తారా స్థాయి అంచనాలు నెల‌కొన్నాయి. అయితే మేక‌ర్స్ ఈ మూవీన్ని ఎలాంటి హంగులు కావాలో అన్నిటినీ మేళ‌వించి అద్భుత‌మైన విజువ‌ల్స్ తో తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని టాక్ కూడా వ‌చ్చింది. అలాగే ఈ మూవీలో విజువ‌ల్స్ ఎఫెక్ట్స్ నెవ‌ర్ బిఫోర్‌గా అదిరిపోయే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. ఇప్పుడు అందుకు సంబంధించే మ‌రిన్ని గాసిప్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ మూవికి గాను హాలీవుడ్ ప్ర‌ముఖ వి ఎఫ్ ఎక్స్ నిర్మాణ సంస్థ వెటా డిజిట‌ల్స్ వారితో ప‌ని చేస్తార‌ని టాక్ వినిపిస్తుంది.మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో కానీ వీరితో టైఅప్ అయితే ఒక అదిరిపోయే విజువ‌ల్ ట్రీట్ గ్యారంటీ అని చెప్పాలి.ప్ర‌పంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ మోత మోగించిన అవ‌తార్ అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్ ఇలా ఎన్నో అదిరిపోయే హాలీవుడ్ చిత్రాల‌కు విజువ‌ల్స్ అందించిన వీరు ఆదిపురుష్‌కు ప‌నిచేస్తున్న‌ట్ట‌యితే ఇది మామూలు ప్లానింగ్ కాద‌ని చెప్పాలి. మ‌రి ఇది వ‌ర‌కు నిజ‌మో కాల‌మే నిర్ణ‌యించాలి. ఈమూవీ విష‌యంలో 1000 కోట్లు వ‌ర‌కు అయినా పెట్ట‌డానికి నిర్మాత‌లు రెడీగా ఉన్నారు మ‌రి అలాంటప్పుడు ఖ‌చ్చితంగా టై అప్ అయినా ఆశ్చ‌ర్యం లేద‌ని చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *