బాలీవుడ్ బ్యూటీ లండ‌న్ లో హోలీ వేడుక‌లు….

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా లండ‌న్‌కే ప‌రిమిత‌మైంది, నిక్‌జోనాస్‌ను పెళ్లి చేసుకున్న త‌రువాత ఈ బ్యూటీ హాలీవుడ్ మూవీల‌లో న‌టిస్తూ మ‌రో వైపు వ్యాపారాల‌ను ప్రారంభిస్తుంది. న్యూయార్క్‌లో సోనా పేరుతో రెస్టారెంట్ ప్రారంభించిన సంగ‌తిన్ని ఈ మ‌ధ్య‌కాలంలో ప్ర‌క‌టించిన ప్రియాంక చోప్రా .. ఈరెస్టారెంట్ లో నోరూరించే భార‌తీయ వంట‌కాల‌ను వండి వ‌డ్డించ‌నున్నార‌ని పేర్కొంది. తాను లండ‌న్‌లో ఉండ‌డంతో రెస్టారెంట్ ప్రారంభోత్స‌వంలో తాను పాల్గొన‌లేక‌పోయాన‌ని కూడా వెల్ల‌డించింది. ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌తి వేడుక‌ను ఆనందంగా జ‌రుపుకునే ప్రియాంక చోప్రా హోలీ వేడుక‌ను త‌న భ‌ర్త నిక్ జోనాస్ తో పాటు ఆయ‌న ఫ్యామిలీతో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకుంది. ఇందులో సంబంధించిన ఫొటోల‌ను ప్రియాంక త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ… నాకు న‌చ్చిన పండుగ‌ల‌లో హోలీ ఒక‌టి. ప్ర‌తి ఒక్క‌రు మీ శ్రేయోభిలాషుల‌తో ఇంట్లోనే హోలీ వేడుక జ‌రుపుకుంటార‌ని ఆశిస్తున్నాను అని ప్రియాంక పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *