అఖండ మూవీకి ప్రగ్యాజైస్వాల్ ప్యాక‌ప్‌….

ఇప్పుడు నంద‌మూరిబాల‌కృష్ణ‌, బోయ‌పాటిశ్రీ‌ను క‌ల‌యిక‌లో వ‌స్తున్న మూవీ అఖండ తెలిసిన విష‌య‌మే. ఇందులో హీరోయిన్‌గా ప్ర‌గ్యాజైస్వాల్ న‌టిస్తుంది. ఈ మూవీ ద్వార‌కా క్రియేష‌న్స్ ప‌తాకంపై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాల‌య్య‌- బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ కావ‌డంతో ఇద్ద‌రు భారీ హిట్ అందుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎస్ ఎస్ థ‌మ‌న్ సంగీతం ఈ మూవీకి హైలెట్‌గా నిల‌వ‌బోతుంద‌న్ని ఇప్ప‌టికే రిలీజైన ఫ‌స్ట్ రోర్ అండ్ టైటిల్ రోర్‌తో అర్థ‌మైపోయింది. కాగా హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రిగిన తాజా షెడ్యూల్‌లో బాల‌య్య‌-ప్ర‌గ్యామ‌ధ్య కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. కొత్త‌గా షెడ్యూల్‌కి ప్ర‌గ్యాజైస్వాల్ ప్యాకప్ చెప్పిన‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. కంచె స్థాయి హిట్ మ‌ళ్ళీ ఈ బ్యూటికి ద‌క్క‌లేద‌నే చెప్పాలి. అయితే బాల‌కృష్ణ అఖండ మూవీతోభారీ హిట్ అందుకుంటాన‌న్న న‌మ్మ‌కంతో ఉంద‌ట ప్ర‌గ్యా. కేవ‌లం 17 రోజుల్లోనే 50 మిలియ‌న్ల వ్యూస్ మార్క్ ని క్రాస్ చేసి తాజా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇవ‌న్నీ ప్ర‌గ్యాకిప్ల‌స్ అవుతాయ‌ని భావిస్తుంద‌ట‌. చూడాలి మ‌రి అఖండ మూవీతో ఎలాంటి స‌క్స‌స్ అందుకుంటుందో. ఇక ప్ర‌గ్యాజైస్వాల్
బాలీవుడ్‌లో కూడా ఒక మూవీ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *