ప్ర‌భాస్ తో జత‌క‌ట్ట‌నున్న క‌త్రీనాక‌ఫ్‌…

ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ … వ‌రుస మూవీల‌తో ఫ్యాన్స్ అల‌రించ‌డానికి సిద్ద‌మయిన సంగ‌తి తెలిసిందే . ఆయ‌న మూవీలు వేల కోట్ల బిజినెస్ జ‌రుపుకుంటున్నాయి. టాలీవుడ్ ద‌ర్శ‌కుల‌కు ఆయ‌న డేట్లు దొర‌క‌డమే క‌ష్ట‌మైపోతోంది. ఇత‌ర భాష‌ల‌కి చెందిన బ‌డా నిర్మాత‌లు… ద‌ర్శ‌కులు ప్ర‌భాస్ తోమూవీలు చేయ‌డానికి పోటీ ప‌డుతున్నారు. ఆయ‌న కొత్త మూవీ రాధే శ్యామ్ రానుండ‌గా, స‌లార్, ఆదిపురుష్‌, ప్రాజెక్టులు సెట్స్ పై ఉన్నాయి. ఆ త‌రువాత ఆయ‌న నాగ్ అశ్విన్‌తో ఒక‌ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ చేయ‌నున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా మూవీనే కావ‌డం విశేషం. ఈ మూవీలు ఇప్పుడు పూర్తివుతాయ‌నేది తెలియ‌దు. కానీ ప్ర‌భాష్ మాత్రం త‌న దూకుడు ఆప‌డం లేదు.వార్ వంటి యాక్ష‌న్ మూవీల‌తో ఔరా అనిపించిన సిద్ధార్త్ ఆనంద్‌కి కూడా ప్ర‌భాస్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్‌గా ఆయ‌న క‌త్రినాకైఫ్‌ను ఒప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఆమె ఎంపిక దాదాపు ఖాయ‌మ‌వుతుంద‌నే అంటున్నారు. క‌త్రినా మంచి పొడ‌గరి క‌నుక‌. తెర‌పై జోడీ ఒక రేంజ్ లో సంద‌డి చేయ‌వ‌చ్చు.శ్ర‌ద్దా క‌పూర్ ,కృతిస‌న‌న్ త‌రువాత ప్ర‌భాస్ స‌ర‌స‌న క‌త్రినా క‌నువిందు చేయ‌నుంద‌న్న మాట‌. ప్ర‌భాస్‌, కాజ‌ల్ జంట‌గా న‌టించిన మూవీ డార్లింగ్ ఎ. క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రొమాంటిక్ ప్రేమ క‌థ‌గా శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ మూవీ ప‌తాకంపై బి.వి.ఎన్ ప్ర‌సాద్ నిర్మించారు. జీవీ ప్ర‌కాశ్ సంగీతాన్ని అందించారు. ఈ మూవీ విడుద‌లైన గ‌త శుక్ర‌వారానికి 11ఏళ్లు పూర్తి చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *