ప్రేమ‌కు విట్ నెస్‌గా -రాధ్యేశామ్

ఇప్పుడు పాన్ఇండియా స్టార్ గా పేరుపొందిన ప్ర‌భాస్ , పూజాహెగ్జే కాంబోలో వ‌స్తున్న మూవీ రాధేశ్యామ్ ఈ విష‌యం తెలిసిందే. జిల్‌ఫేం రాధాకృష్ణ‌కుమార్ ఈ మూవీన్ని తెర‌కెక్కించ‌గా, ఈ చిత్రం పూర్వ జ‌న్మ‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కింది. ఇందులో ప్ర‌భాస్ విక్ర‌మాదిత్య పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, పూజాహెగ్డే ప్రేర‌ణ అనే ప్రాత‌తో సంద‌డి చేయ‌నుంది. ఇప్ప‌టికే వీరిద్ద‌రి పాత్ర‌ల‌కు సంబంధించిన లుక్స్ విడుద‌ల కాగా, ఇవి ఫ్యాన్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. టీజ‌ర్ ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తుండగా, తాజాగా మూవీకీ సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. ప్రేమ‌కు విట్ నెస్ గా వాలంటైన్స్‌డే ఉంటుంద‌ని తెలియజేస్తూ ఆ రోజు మూవీకి సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల కానున్న‌ట్టు హింట్ ఇచ్చారు. విక్ర‌మాదిత్య‌, ప్రేర‌ణ‌ల‌కు సంబంధించిన గ్లింప్స్ ఫ్యాన్స్‌కు తప్ప‌క థ్రిల్ క‌లిగిస్తుంద‌ని తెలుస్తుంది. జ‌స్టిస్ ప్ర‌భాక‌ర‌ణ్ మూవీకి సంగీతం అందిస్తుండ‌గా, ఆయ‌న స‌ర్వ‌ప‌ర‌చిన బాణీలు ప్రేక్ష‌కుల‌కు థ్రిల్ క‌లిగిస్తాయి అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఇట‌లీలోనే
జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. క‌రోనా విజృంభిస్తున్న స‌మ‌యంలోనే ఇట‌లీకి వెళ్లి అక్క‌డ క‌రోనా జా
గ్ర‌త్త‌లు పాటిస్తూ చిత్రీక‌ర‌ణ పూర్తి చేశారు. స‌మ్మ‌ర్‌లో మూవీన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *