అద్భుత ప్రేమ‌ కావ్యం-రాధేశ్యామ్‌

బాహుబ‌లి మూవీ ద్వారా ప్రపంచానికి తెలిసిన‌ పాన్ఇండియన్ స్టార్ ప్ర‌భాస్,అందాల‌తార పూజాహెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన తాజాగా మూవీ రాధేశ్యామ్ పీరియాడిక్ ల‌వ్ స్టోరీగా ఈ మూవీ పై ఎప్ప‌టి నుంచో మంచి అంచ‌నాలు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. మ‌రి ఇదిలా ఉండ‌గా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గుస‌గుస‌లు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ గుస‌గుస‌ల ప్ర‌కారం ఈ మూవీలో కొన్ని భారీ ట్విస్టులే ఉన్న‌ట్టుగా తెలుస్తుంది. మ‌రీ ఈ స‌మాచారం ప్ర‌కారం ప్ర‌భాస్ మ‌రియు గీత‌కు ఉద్దేశించి ఉండే స‌న్నివేశాలు అత్యంత కీల‌క పాత్ర‌లు పోషిస్తాయ‌ట‌. ఇవే ప్ర‌భాస్ మ‌రియు పూజా హెగ్డేల పాత్ర‌లు చుట్టూ అతి పెద్ద ట్విస్టులు చూపిస్తాయ‌ని తెలుస్తుంది. ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కాన్సెప్ట్ లో వీటి ఆధారంగానే మంచి స్క్రీన్ ప్లే ను చూపించ‌నున్నాడ‌ట‌. మ‌రి అద్భుత ప్రేమ‌ కావ్యంలో కంటెంట్ ఎలాంటి పాత్ర పోషిస్తుందో తెలియాలి అంటే వ‌చ్చే జూలై 30 వ‌కు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *