మూవీల‌పై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి…

టాలీవుడ్ అగ్ర‌హీరో ప్ర‌భాస్ ఇప్పుడు ప‌లు మూవీల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న న‌టించిన రాధేశ్యామ్ మూవీ జూలై 30 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ప్ర‌భాస్ న‌టిస్తున్న స‌లార్‌, ఆదిపురుష్ మూవీలు వ‌చ్చే సంవ‌త్స‌రం విడుద‌లకు సిద్ధంగా ఉన్నాయి. స‌లార్ మూవీ ఏప్రిల్ 14,2022 న విడుద‌ల కానుండ‌గా, ఆదిపురుష్ చిత్రాన్నా ఆగ‌స్ట్ 11,2022 న రిలీజ్ చేయ‌నున్నారు. భారీ బ‌డ్జ్‌ట్‌తో రూపొందుతున్న ఈ రెండు మూవీల‌పై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఇక ప్ర‌భాస్‌- నాగ్ అశ్విన్ కాంబినేష‌న్‌లో రూపొందనున్న మూవీ స‌మ్మ‌ర్‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుండగా, ఈ మూవీని సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌గా భారీ బ‌డ్జెట్తో హాలీవుడ్ రేంజ్‌లో తెర‌కెక్కించ‌నున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యార ప్ర‌భాస్‌.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్‌తో క‌లిసి స్టైలిష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. వార్‌, బ్యాంగ్ బ్యాంగ్ ఫేమ్ సిద్ధార్ధ్ ఆనంద్ ఈ మూవీన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. య‌ష్ రాజ్ ఫిలింస్ ఈ మూవీన్ని నిర్మించ‌నునంద‌. త్వ‌ర‌లోనే ఈ మూవీకి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *