మ‌రో ప‌వ‌ర్‌పుల్ స‌బ్జెక్ట్ సిద్ధం-ప్ర‌భాస్‌

పాన్ఇండియా స్టార్ గా బ‌హుబ‌లి మూవీ ద్వారా అవ‌త‌రించాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. ఇప్పుడు ఆయ‌న వ‌రుస భారీ ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉన్నారు. ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తున్న యాక్ష‌న్ ఎంట‌రటైన‌ర్ స‌లార్ సింగ‌రేణి ప్రాంతంలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇదిలావుండ‌గా ప్ర‌భాస్ బాలీవుడ్‌లో మ‌రో బిగ్గెస్ట్ మూవిన్ని అంగీక‌రించార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళితే వార్ మూవీతో బాలీవుడ్ సంచ‌ల‌నం సృష్టించారు. ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్‌. హృతిక్‌రోష‌న్‌, టైగర్ ష్రాఫ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన వార్ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయిలోవ‌సూళ్ల‌ను సాధించింది. తాజాగా ఈ చిత్ర ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్‌మ‌రో ప‌వ‌ర్‌పుల్ యాక్ష‌న్ స‌బ్జెక్ట్‌ను సిద్ధం చేశార‌ట‌. ఇందులో ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌బోతున్నార‌ని బాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు సిద్దార్థ్ ఆనంద్ ప్ర‌భాస్ మ‌ధ్య క‌థా చ‌ర్చ‌లు పూర్త‌
య్యాయ‌ని అంటున్నారు. పాన్ ఇండియా మూవీగా భారీ వ్య‌యంతో ఈ మూవీను తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని తెలిసింది. ఈ మూవీను సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లో వెలువ‌డ‌నుంద‌ని స‌మాచారం. ఈ మూవీ ఈ సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశ‌ముంద‌ని చెబుతున్నారు. ఇప్పుడు ప్ర‌భాస్ రాధేశ్యామ్ స‌లార్, ఆదిపురుష్ మూవీతో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ చేయ‌బోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *