బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్ర‌భాస్ మూవీ…

పాన్ ఇండియా హీరో మారిన యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ఇంత‌కుముందే వెంట‌వెంట‌నే నాలుగు పాన్ ఇండియా మూవీల‌ను అనౌన్స్ చేసిన డార్లింగ్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో క‌లిసి మ‌రో పాన్ ఇండియా మూవీ చేసేందుకు స‌న్న‌హానాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. బ్యాంగ్ బ్యాంగ్‌, వార్ వంటి భారీ బ‌డ్జెట్ మూవీల‌ను తెర‌కెక్కించిన ఈ ప్ర‌ముఖ బాలీవుడ్ డైరెక్ట‌ర్ ప్ర‌భాస్ తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చ‌ర్చ‌లు స‌ఫ‌లం అయితే డిసెంబ‌ర్ 2022 లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది. 2023 ఈ సినిమాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్పుడు సిద్ధార్థ్ … షారూఖ్ ఖాన్‌, దీపిక ప‌దుకొణే, జాన్ అబ్ర‌హం కాంబినేష‌న్‌లో ప‌ఠాన్ అనే మూవీ రూపొందిస్తున్నారు. దీని త‌రువాత హృతిక్‌, దీపికా కాంబినేష‌న్‌లో ఫైట‌ర్ అనే వార్ డ్రామా చేయ‌నున్నాడు. ఇవి పూర్త‌య్యాక ప్ర‌భాస్ తో మూవీ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. కాగా, ప్ర‌భాస్ న‌టించిన రాధేశ్యామ్ మూవీ త్వ‌ర‌లో ఫ్యాన్స్‌
ముందుకు రానుండ‌గా, ఫిబ్ర‌వ‌రి లో ప్ర‌శాంత్‌నీల్ స‌లార్‌, ఓంరౌత్ ఆదిపురుష్ మొద‌లు పెట్ట‌నున్నాడు.
ఇక నాగ్ అశ్విన్ పీరియాడిక‌ల్ మూవీ కూడా వీలైనంత త్వ‌ర‌గా సెట్స్ పైకి వెళుతున్న‌ట్టు అర్థ‌మ‌వుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *