పుష్ప మూవీలో ప‌వ‌ర్‌పుల్ యాక్ష‌న్ సీన్స్ తెర‌కెక్కిస్తున్నార‌ట‌

టాలీవుడ్‌లో ఇప్పుడు అగ్ర‌హీరో అల్లు అర్జున్ హీరో గా న‌టిస్తున్న భారీ బ‌డ్జెట్ మూవీ పుష్ప బ‌న్నీ మొట్ట మొద‌టి పాన్ ఇండియ‌న్ మూవీ కావ‌డంతో దీనిపై అంతే స్థాయి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక ఇదిలా ఉండ‌గా ఈమూవీ విష‌యంలో ఇప్ప‌టికే ప‌లు ఆన్ లొకేష‌న్ లీకులు అభిమానుల‌ను ఇబ్బందులు పెడుతున్నాయి. వీటితో పాటుగా ఈ మూవీ విష‌యంలో అనేక గాసిప్స్ కూడా ఊపందుకున్నాయి. అలా లేటెస్ట్‌గా వ‌చ్చిన ఓ గాసిప్ ను బ‌న్నీ టీం వారు కొట్టి పారేశారు. ఈ మూవీలో ప్ర‌స్తుతం పాట చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంద‌ని టాక్ రాగా వాటిలో ఎలాంటి నిజ‌మూ లేద‌ని తెలుస్తుంది. మేక‌ర్స్ మూవీ మొద‌లు పెట్టిన‌ ద‌గ్గ‌ర నుంచి ప‌వ‌ర్‌పుల్ యాక్ష‌న్ సీన్స్ నే తెర‌కెక్కిస్తున్నారు. మ‌రి ఇంకా ఏవ్ తీస్తూ ఉండ‌చ్చేమో కానీ ఇప్పుడు అయితే పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంద‌ని వ‌చ్చిన గాసిప్‌లో ఎలాంటి నిజ‌మూ లేదు. సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తుండ‌గా మైత్రి మూవీ మేక‌ర్స్ వారి బ‌డ్జెట్ తో నిర్మాణం వ‌హిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *