పూజానే త‌నంత‌ట తాను రిలీల్ చేసెయ్య‌డంతో క‌న్ప‌ర్మ్‌…

ఇప్పుడు టాలీవుడ్ అగ్ర‌హీరో మెగాస్టార్ చిరంజీవి ,కొర‌టాల శివ‌కాంబినేష‌న్ లో వ‌స్తున్న మూవీ ఆచార్య విష‌యం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ మూవీ ఆచార్య అయితే ఈ మూవీకి సంబంధించి షూట్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా న‌డుస్తుంది. ఈమ‌ధ్య‌కాలంలో ఈమూవీలో కీల‌క పాత్ర పోషిస్తున్న మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ త‌న టాకీ పార్ట్‌ను కంప్లీట్ చేసుకున్నాడు. అయితే ఈ మూవీకి సంబంధించి అధికారిక అప్డేట్ ను లేకుండా మెగాస్టార్ ఈ మూవీ టైటిల్ ను ఎలా రివీల్ చేసేసారో తెలిసిందే. అలాగే గ‌త కొంత కాలం నుంచి ఈ మూవీలో మ‌రి హీరోయిన్ గా పూజా హెగ్డే ఉంద‌ని వార్త ఉంది, కానీ దానిపై మేక‌ర్స్ నుంచి ఎలాంటి క‌న్ప‌ర్మేష‌న్ రాలేదు. కానీ తాను ఆచార్య‌లోఉన్న‌ట్టుగా పూజా హెగ్డేనే త‌నంత‌ట తాను రివీల్ చేసెయ్య‌డంతో క‌న్ప‌ర్మ్ అయ్యిపోయింది.దీనితో చిరు లానే ఎలాంటి అధికారిక అప్డేట్ లేకుండానే ఈమూవీలోమేజ‌ర్ అప్డేట్స్ రివీల్ అయ్యిపోయాయి. ప్ర‌స్తుతం ఇదే వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *