ఆమె నాకు సీనియ‌ర్‌- పూజాహెగ్డే

హైద‌రాబాద్‌: మెగాస్టార్,కాజ‌ల్ జంట‌గా న‌టిస్తున్నా ఆచార్య మూవీలో మెగాప‌వ‌ర్‌స్టార్ కు జోడిగా పూజాహెగ్డే న‌టిస్తున్న‌విష‌యం తెలిసిందే. చ‌దువుకునే రోజుల్లో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా త‌న‌కు సీనియ‌ర్ అని న‌టి పూజా హెగ్డే తెలిపారు. రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ మూవీల‌తోపాటు అటు బాలీవుడ్ లోనూ వ‌రుస ప్రాజెక్ట్‌లు ఒకే చేస్తూ కెరీర్‌లో దూసుకెళ్తున్నారు.కొత్తగా ఆమె ఓ ఆంగ్ల ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న స్కూల్ డేస్ గురించి స్పందించారు. స్కూల్ లో ఉన్న‌ప్పుడు తాను త్వ‌ర‌గా ఎవ‌రితోనూ మాట్లాడేదాన్ని కాద‌ని పూజా తెలిపారు. నేను-త‌మ‌న్నా ఒకే స్కూల్ లో చ‌దువుకున్నాం. ఆమె నాకు సీనియ‌ర్ . సంప్ర‌దాయ దుస్తులైనా, పాశ్చాత్య దుస్తులైనా… త‌మ‌న్నా చాలా అందంగా ఉంటారు. స్కూల్‌లో జ‌రిగే ప్ర‌తి కార్య‌క్ర‌మంలోనూ ఆమె డ్యాన్స్ చేసేది. ఆమె అంద‌రితోనూ చ‌క్క‌గా క‌లిసిపోయేది. అంద‌ర్నీ ఒకేలా చూసేది. స్నేహితుల్ని చేసుకునేది. త‌మ‌న్నాలోని ఆ క‌లివిడిత‌న‌మే నాకెంతో న‌చ్చింది. అని న‌టి పూజా హెగ్డే తెలిపారు. స‌ర్క‌స్ , ఆచార్య షూట్స్‌తో ఇప్పుడు బిజీగా ఉంటున్నారు. మ‌రో వైపు ,సీటిమార్ విడుద‌ల ప‌నుల్లో బిజీగా ఉన్నారు. న‌టి త‌మన్నా. దీనితోపాటు ఆమె గుర్తుందా శీతాకాలం ఎఫ్‌-3, అంధాధున్ రీమేక్ చిత్రీక‌ర‌ణ‌ల్లో పాల్గొంటున్నారు. త‌మ‌న్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *