వచ్చే మ‌హాశివ‌రాత్రి కానుక‌గా ప‌వ‌న్ ఫ‌స్ట్‌లుక్‌….

టాలీవుడ్ అగ్ర‌హీరో ప‌వ‌న్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్ప‌టికే వ‌కీబ్‌సాబ్ మూవీ షూటింగ్ పూర్తి చేస్తుంది. విడుద‌ల కు సిద్ధం ఉంద‌ని విష‌యం తెలిసిందే.ఆయ‌న ప‌లు ఆస‌క్తిక‌ర ప్రాజెక్ట్ ల‌లో ద‌ర్శ‌కుడు జాగ‌ర్ల‌మూడి క్రిష్‌తో ప్లాన్ చేసిన భారీ బ‌డ్జెట్ అండ్ పీరియాడిక్ మూవీ కూడా ఒక‌టి. అయితే ప‌వ‌న్ ఎన్ని మూవీలు చేస్తున్న‌ప్ప‌టికీ కూడా ఈ మూవీనే ప్ర‌స్తుతం మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా నిలిచింది. ఇదిలా ఉండ‌గా ఈ మూవీకి సంబంధించి ఫ‌స్ట్ లుక్ మ‌రియు టైటిల్ ను ఈ వ‌చ్చే మహాశివ‌రాత్రి కానుక‌గా విడుద‌ల చెయ్య‌డానికి ఫిక్స్ చేశారు. అయితే దీనితో పాటుగానే గ‌త కొన్ని రోజులుగా మ‌రిన్ని గాసిప్స్ దీనిపై వినిపిస్తున్నాయి. అదే రోజున ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తో పాటుగా టీజ‌ర్ ను కూడా మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ని గాసిప్స్ మొద‌ల‌య్యాయి. కానీ ఇందులో మాత్రం ఇంకా ఎలాంటి నిజ‌మూ లేద‌న్న‌ట్టే తెలుస్తుంది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ కానీ అలాంటి అవ‌కాశం కానీ లేన‌ట్టే తెలుస్తుంది. ఇప్ప‌టికి అయితే ఇవ‌న్నీ జ‌స్ట్ రూమర్స్ గానే అనుకోవాలి. మ‌రి ఈభారీ మూవీలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు అలాగే ఎం ర‌త్నం నిర్మాణం వ‌హిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *