ప‌వ‌న్ కొత్త మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తారంట‌…

టాలీవుడ్ అగ్ర‌హీరో ప‌వ‌న్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌కీల్‌సాబ్ మూవీలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న జ‌న‌సేన పార్టీని స్థాపించిన త‌రువాత కొంత కాలం సినీమాల‌కు గ్యాఫ్ తీసుకొన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ ఇటీవ‌ల ‌కాలంలో ప‌వ‌న్ మూవీల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్ప‌టి నుంచి వ‌రుస మూవీల‌తో బిజీగా దూసుకెళ్తున్నారు. వ‌కీల్‌సాబ్ మూవీ చిత్రీక‌ర‌ణ‌ను ముగించుకున్నారు. ఇప్పుడు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న త‌దుప‌రి మూవీన్ని రూపొందిస్తున్నారు. అయితే ఈ మూవీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త లుక్స్‌లో క‌నిపించ‌నున్నారంట‌. ఈ మూవీ కోసం ప‌వ‌న్ త‌న పిట్ నెస్‌లో మార్పులు చేయాల‌ని నుకుంటున్నారంట‌. అందు కోసం ప‌వ‌న్ త‌న కెరీర్‌లో చాలా కాలం త‌రువాత మ‌ళ్లీ జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేసేందుకు సిద్ద‌మ‌య్యారు. అందుకుగాను స్పెష‌ల్ ట్రైన‌ర్‌ను సిద్దం చేసుకున్నారంట‌. ఇదిలా ఉంటే ఈ మూవీ టైటిల్ విష‌యంలో ఇప్ప‌టికీ క్లారిటీ రాలేదు. కొత్త‌గా ఈ మూవీకి కేవ‌లం వీర‌మ‌ల్లు అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు టాక్ సినిఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అతి త్వ‌ర‌లో ఈ మూవీ నుంచి స్పెష‌ల్ అప్‌డేట్ ఇవ్వ‌నున్నారంట‌. అందులో మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌లు ఎంత వ‌ర‌కు నిజ‌మ‌నేది తెలియాల్సిఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *