ప‌వ‌న్ మూవీ వ‌చ్చే ఏడాది సంక్రాంతి రేస్ నుంచి త‌ప్పుకుంది..

టాలీవుడ్ అగ్ర‌హీరో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దాదాపు రెండున్న‌రేళ్లు త‌రువాత హీరోగా టేక‌ప్ చేసిన మూవీ వ‌కీల్‌సాబ్ బాలీవుడ్ హిట్ మూవీ పింక్‌కురీమేక్‌గా ఈ మూవీన్ని తెర‌కెక్కిస్తుండ‌గా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కం బ్యాక్ మూవీ కావ‌డంతో దీనిపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే ఈ సంవ‌త్స‌రంలో వేస‌విలో విడుద‌ల కావాల్సిన ఈ మూవీ క‌రోనా వల్ల వ‌చ్చే సంవ‌త్స‌రం సంక్రాంతి రేస్‌లో విడుద‌ల కాబోతుంది. అని టాక్ వ‌చ్చింది. కానీ షూటింగ్‌కు మ‌ళ్లీ బ్రేక్ రావ‌డంతో ఆరేస్ నుంచి ఈ మూవీ త‌ప్పుకున్న‌ట్టు అయ్యింది. అయితే ఇప్పుడు ఈ పండ‌గ సీజ‌న్ ను దాటి ఈ మూవీ ఆ త‌రువాత పండ‌గ రేస్ ఉగాదిలో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ విష‌యం పైనే మేక‌ర్స్ ఒక అధికారిక ప్ర‌క‌ట‌న ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్టుగా కూడా తెలుస్తుంది. దీనితో వ‌కీల్‌సాబ్ ఆగ‌మ‌నం అక్క‌డ నుంచి ఇక్క‌డికి షిప్ట్ అయ్యింద‌ని చెప్పాలి. ఈ మూవీన్ని దిల్ రాజు నిర్మాణం వ‌హిస్తుండ‌గా థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. అలాగే శృతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా నివేతా థామ‌స్ మ‌రియు అంజ‌లిలు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *