బాక్సాఫీన్ వ‌ద్ద క‌లెక్ష‌న్ సునామీని క్రియేట్ చేస్తోంది- వ‌కీల్‌సాల్

టాలీవుడ్ అగ్ర‌హీరో ప‌వ‌న్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌కీల్‌సాబ్ మూవీ విడుద‌ల అయిన విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ మూడు సంవ‌త్స‌రాల త‌రువాత మూవీ చేసిన‌ప్ప‌టికి ఆయ‌న వాడివేడి ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఏప్రీల్ 9వ విడుద‌లైన ఈమూవీ బాక్సాఫీన్ వ‌ద్ద క‌లెక్ష‌న్ సునామీని క్రియేట్ చేస్తోంది. తొలి రోజున రూ.36.46 కోట్ల షేర్ వ‌సూళ్ల‌ను సాధించింది. రెండో రోజు కూడా అదే జోరును కొన‌సాగించింది. ప్రేక్ష‌కాభిమానులే కాదు, మెగాస్టార్ చిరంజీవి, చ‌ర‌ణ్ స‌హా సినీ సెల‌బ్రిటీలంద‌రూ మూవీ చాలా బావుందంటూ త‌మ స్పంద‌న‌ను తెలియ‌జేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ లిస్టులో సూప‌ర్ స్టార్ మ‌హేష్ కూడా చేరారు. వ‌కీల్ సాబ్‌లో టాప్ ఫామ్ ప‌వ‌ర్ ప్యాక్‌డె్ పెర్పామెన్స్ చేశారు. ఎంతో గొప్ప క‌మ్‌బ్యాక్‌. ప్ర‌కాశ్‌రాజ్ గారు బ్రిలియంట్. నివేతాథామ‌స్‌, అంజ‌లి అన‌న్య‌నాగ‌ళ్ల‌,, హార్ట్ ట‌చ్ పెర్పామెన్స్ చేశారు. థ‌మ‌న్‌టాప్ రేంజ్ మ్యూజిక్ ను అందించాడు. ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు అంటూ మ‌హేష్ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *