వ‌కీల్ సాబ్ కు షూట్ మ‌రింత పెరిగింది అని టాక్…

టాలీవుడ్ అగ్ర‌హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న మూవీ వ‌కీల్ సాబ్ అంద‌రికి తెలిసిన విష‌య‌మే. వ‌కీల్ సాబ్ భారీ అంచ‌నాలు సెట్ చేసుకున్న ఈ మూవీ కోసం అభిమానులు కూడా చాలానే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ లాక్ డౌన్ కు ముందే చాలా మేర సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. ఇంకా ప్ర‌స్తుతం లాక్ డౌన్ అనంత‌రం మ‌ళ్ళీ షూట్ రీస్టార్ట్ అయ్యింది. ఇందులో ప‌వ‌న్ కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే చాలా త‌క్కువే షూట్ ఉన్న ఈ మూవీ ఎంత‌కీ కంప్లీట్ కావడం లేదా అని కూడా అనిపించొచ్చు. మ‌రి దీనికి సంబంధించి తాజా టాక్ ఒక‌టి వినిపిస్తుంది. నిజానికి మేక‌ర్స్ చెప్పిన దానికంటే కాస్తంత ఎక్కువ షూట్ బ్యాల‌న్స్ ఉంద‌ట‌. అంతే కాకుండా ఫ్లాష్‌బ్యాక్‌లో మ‌రిన్ని సీన్స్ యాడ్ చేయ‌డం మూలాన వ‌కీల్ సాబ్ కు షూట్ మ‌రింత పెరిగింది అని టాక్ వినిపిస్తుంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజమో తెలియాల్సిఉంది. ఈ మూవీలోప‌వ‌న్ స‌ర‌స‌న శృతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే థ‌మ‌న్ సంగీతం ఇస్తున్న ఈ మూవీన్ని దిల్‌రాజు నిర్మాణం వ‌హిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *