హ‌రీష్ శంక‌ర్ ,ప‌‌వ‌న్‌క‌ళ్యాణ్ కాంబో మ‌రో మూవీ….

టాలీవుడ్ అగ్ర‌హీరో ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హారీష్‌శంక‌ర్ కాంబినేష‌న్‌లో కొత్త మూవీకోసం ఓ ప‌వ‌ర్‌పుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడ‌ట‌. అయితే తాజాగా ఈ మూవీ స్క్రిప్ట్‌కి సంబంధించి ఒక ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్ ఏమిటంటే.. ఈ మూవీలో కూడా ప‌వ‌ర్‌స్టార్ కొన్ని నిముషాల పాటు ఐబీ ఆఫీస‌ర్ గా క‌నిపిస్తార‌ని… అయితే క్లైమాక్స్ సీక్వెన్స్ లో మాత్ర‌మే ప‌వ‌న్ ఐబీ ఆఫీస‌ర్ అనే విష‌యం రిలీల్ అవుతుంద‌ని తెలుస్తోంది. ఇక గ‌తంలో హారీష్‌, ప‌వ‌న్ క‌ళాణ్యా క‌ల‌యిక‌లో వ‌చ్చిన మూవీ గ‌బ్బ‌ర్ సింగ్‌తో ఇండ‌స్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు హ‌రీష్‌- ప‌వ‌న్ చెయ‌బోతున్న మూవీలో కూడా ఐబీ సీక్వెన్స్ ఉంద‌నే స‌రికి ఈ మూవీపై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. పైగా ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే అంశాల‌న్ని ఈ మూవీలో ఉంటాయ‌నే న‌మ్మ‌కం ఉంది. ఆ కార‌ణంగా ఈ మూవీపై ఫ్యాన్స్ బాగా ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇక ఈ మూవీలో క‌థానాయ‌కిగా పూజాహెగ్డే న‌టించే అవ‌కాశం ఉంద‌ట‌. ఇక ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడు వ‌కీల్‌సాబ్ తో క్రిష్ మూవీ కూడా చేస్తున్నాడు. క్రిష్ మూవీ కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌టిసారి
పిరియాడిక‌ల్ బ్యాక్ డ్రాప్లో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ పూర్త‌వ‌గానే హ‌రీష్ శంక‌ర్ మూవీ మొద‌లుకానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *