ప‌వ‌న్‌స్టార్ బ్యాన‌ర్ లో మెగాప్రిన్స్‌….

టాలీవుడ్ అగ్ర‌హీరో ప‌వ‌న్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ బ్యాన‌ర్ మెగాప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ హీరోగా ఒక మూవీ రాబోతుంద‌ని తెలుస్తోంది. ర‌చ‌యిత కోన‌వెంక‌ట్ అందించిన క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కబోతుంద‌ని తెలుస్తోంది. కాక‌పోతే ఈ మూవీకి ఇంకా ద‌ర్శ‌కుడిని ఫైన‌ల్ చేయ‌లేద‌ట‌. ఇది జ‌రిగితే. ఇది మెగా అభిమానులను శుభ‌వార్త‌నే. మ‌రి ఈ వార్త నిజం అవుతుందేమో చూడాలి. మ‌రోప‌క్క ప‌వ‌ర్‌స్టార్ సైతం రీఎంట్రీ ఇస్తూ వ‌రుస మూవీల‌కు సైన్ చేసిన విష‌యం తెలిసిందే. పింక్ తెలుగు రీమేక్ వ‌కీల్ సాబ్ ,అలాగే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక మూవీ చేస్తున్న ఆయ‌న వీటి త‌రువాత హారీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక మూవీ చేయ‌డానికి ఒప్పుకున్నారు. ఈప్రాజెక్ట్స్ అన్నీ వ‌చ్చే సంవ‌త్స‌రం క‌ల్లా పూర్తైపోతాయి. ప‌వ‌న్ 2022 లో కూడా మూవీలు చేసే ఆలోచ‌న‌లో ఉండ‌టంతో ద‌ర్శ‌కుడు డాలీ కూడా మూవీ చేయ‌డానికి ప‌వ‌న్ నుండి సానుకూల స్పంద‌నే వ‌చ్చింద‌ని, అన్నీ కుదిరితే మూవీ ఓకే అయి,2022 లో వ‌చ్చే అవ‌కాశం ఉంది. అలాగే ప‌వ‌న్ ఇప్పుడు రీమేక్ ఫిల్మ్స్‌పై కూడా బాగా ఆస‌క్తి చూపిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *