వ‌కీల్‌సాబ్ కాకుండా మ‌రో నాలుగు మూవీలు…

టాలీవుడ్ అగ్ర‌హీరో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మూవీల్లోకి రీఎంట్రీ ఇస్తూ వ‌రుస మూవీల‌ను సైన్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే పింక్ తెలుగు రీమేక్ వ‌కీల్‌సాబ్‌, అలాగే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో పిరియాడిక్ మూవీ చేస్తున్నాడు. తాజాగా అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ రీమేక్‌ని కూడా అర్జంటుగా ట్రాక్ ఎక్కించాడ‌ట‌. ఇక నుండికూడా రీమేక్ క‌థ‌లు తీసుకుర‌మ్మ‌ని ప‌వ‌న్ ద‌ర్శ‌కుల‌ను చేబుతున్నాడ‌ట‌. అలాగే హారీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోనూ మ‌రియు సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలోనూ ఒక మూవీ చేయ‌డానికి ఒప్పుకున్నారు. ఇక ప‌వ‌న్ 2022 లోకూడా మూవీలు చేసే ఆలోచ‌న‌లో ఉండ‌టంతో ద‌ర్శకుడు డాలీతో కూడా ప‌వ‌న్ ఒక మూవీ చేసే అవ‌కాశం ఉంది. కాగా డాలీ ద‌ర‌క‌త్వంలో మూవీ చేయ‌డానికి ప‌వ‌న్ నుండి సానుకూలా స్పంద‌న వ‌చ్చింద‌ని, అన్నీ కుదిరితే మూవీ ఒకే అయి,2021 చివ‌ర్లో షూటింగ్ మొద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయ‌ట‌. అంటే వ‌కీల్‌సాబ్ కాకుండా ప‌వ‌న్ నుండి మ‌రో నాలుగు మూవీలు రాబోతున్నాయి. అన్న‌మాట‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *